TS-TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023

TS-TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023 తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023 నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. టెట్‌ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పరీక్ష వివరాలు…

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023

అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావొచ్చు. 

పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతులకు బోధించేందుకు పేపర్‌-1 రాయాలి. దానికి డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ విద్యార్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) అనుమతి ఇచ్చింది. పేపర్‌-2 రాసేందుకు కేవలం బీఈడీ పూర్తిచేసిన వారే అర్హులు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్‌ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. 

TS-TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023

దరఖాస్తు ఫీజు: రూ.400గా నిర్ణయించారు.

ముఖ్య తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పరీక్ష తేదీ, సమయం: సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష ఉంటుంది. పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. 

హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ తేదీలు: అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఫలితాల వెల్లడి: ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల కానున్నాయి.

Notification – TSTET 2023 Click here

TS-TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com