NMMS scholarship 2023: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023

[google-translator]

NMMS scholarship 2023: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023 | ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం తాజాగా విడుదల చేసింది.

వివరాలు:

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24

ఏడాదికి రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహం: ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

అర్హతలు:

* ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.

* ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో చదవుతూ ఉండాలి. 

* విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100(ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ.50) ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 10-08-2023

పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15-09-2023

సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 16-09-2023

దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరితేది:19-09-2023

డీఈవో లాగిన్‌లో దరఖాస్తు ఆమోదం పొందేందుకు చివరి తేదీ: 22-09-2023

Apply OnlineClick here
NotificationDownload
Official SiteClick here

NMMS scholarship 2023: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

Disclaimer – Naukriwin.com

This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com