విద్యాశాఖ సమీక్ష – త్వరలోనే డిఎస్సీ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం – రేవంత్ రెడ్డి

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని, వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని (DSC NOTIFICATION IN TELANGANA SAYS REVANTH REDDY) డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు.

‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

★ త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్

రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డీ.ఎస్.సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.