SBI Clerk Prelims Admit Cards

SBI Clerk Prelims Admit Cards, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) జూనియర్‌ అసోసియేట్(క్లర్క్‌) ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఫిబ్రవరిలో మెయిన్స్‌ జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌(క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 

ప్రిలిమ్స్‌ విధానం: ఈ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు జరుగుతుంది.  

పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు. 

Exam Centers in AP & TS: Anantapur, Bhimavaram, Chirala, Gudur, Guntur, Kadapa, Kakinada, Kurnool, Nandyala, Narasaravpet, Nellore, Rajamahendravaram, Rajampet, Srikakulam, Tadepalligudem, Tirupati, Vijayawada, Visakhapatnam, Vijayanagaram, Hyderabad, Karimnagar, Khammam, Mahbub Nagar, Nalgonda, Warangal.

Click to Download SBI Clerk Prelims Admit Card

Leave a Comment