రేషన్ కార్డ్ లేకున్నా 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (డిసెంబర్ – 27) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు లేని వారికి శుభవార్త చెప్పారు. 6 గ్యారెంటీలలో ఐదు గ్యారంటీల అమలు కొరకు ఈరోజు నుండి జనవరి 6 వరకు తీసుకుంటున్న దరఖాస్తులను తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా (6 guarantees without ration card) దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఈరోజు ప్రజా పాలన కార్యక్రమం లోగో ఆవిష్కరించి, దరఖాస్తు నమూనాను కూడా ఆవిష్కరించారు. ప్రజలు సంబంధిత నమూనాలో దరఖాస్తు ఫారం నింపి సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

త్వరలోనే తెల్ల రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించి, నూతన రేషన్ కార్డులను ప్రజలకు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave a Comment