PENSION – 50 ఏళ్లకే పెన్షన్

పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. 50 ఏళ్ల వయసు రాగానే పెన్షన్ ప్రయోజనాలు (Pension at 50 years onwards in Jharkhand state) అందుకోవచ్చని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ప్రకటించారు.

రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితుల్లో మరణాల రేటు అధికంగా ఉందని, 60 ఏళ్లు దాటాక వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదన్నారు.

Leave a Comment