Ration Card – తెల్ల రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (డిసెంబర్ – 28) : అర్హులైన ప్రజలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయడమనేది నిరంతర ప్రక్రియ (white ration card application in telangana) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆరు గ్యారెంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి కచ్చితంగా కార్డు లేని వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తెల్ల రేషన్ కార్డుల జారీ మరియు వారసత్వ భూముల బదిలీ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని దీని ద్వారా నిరంతరం ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ఐదు గ్యారెంటీ పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Comment