Vidya Bharosa Cards – వచ్చే విద్యాసంవత్సరం నుండి – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలలో కీలకమైనది విద్యార్థులకు విద్యా భరోసా కార్డు జారీ. అర్హులైన విద్యార్థులకు 5 లక్షల రూపాయలతో కూడిన విద్యా భరోసా కార్డులను (Vidya Bharosa Cards – Yuva Vikasham Scheme) యువ వికాసం గ్యారంటీ కింద అమలు చేయాల్సి ఉంది.

వచ్చే విద్యా సంవత్సరం (2024 – 25) నుండి ఈ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కళాశాలలోనే కౌంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి 5 లక్షలు విలువగల విద్యా భరోసా కార్డులను జారీ చేయనున్నారు.

విద్యా భరోసా కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి విధివిధానాలను, నియమ నిబంధనలను, అర్హతలను తేల్చడానికి త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించనున్నారు.

Leave a Comment