ఆదిలాబాద్ డివిజన్ లో చౌక ధరల దుకాణము డీలర్ల నియామకం కొరకు ప్రకటన

ఆదిలాబాద్ డివిజన్ లో చౌక ధరల దుకాణము డీలర్ల నియామకం కొరకు ప్రకటన | పై సందర్భము ను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని క్రింది మండలాల్లోని గ్రామాలలో గల చౌకధరల దుకాణం డీలర్ల ఖాళీలను భర్తీ చేయుటకు గురించి ప్రకటన జారీ చేయనైనది. ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణముల వివరములు ఈ క్రింది విధముగా ఉన్నవి.

ఆదిలాబాద్ డివిజన్ లో చౌక ధరల దుకాణము డీలర్ల నియామకం కొరకు ప్రకటన

Details…

Total: 27

విద్యార్హత :

1. దరఖాస్తు దారులు కనీస విద్యార్హత పదవ తరగతి (యస్.యస్.సి) పాసై ఉండాలి
2. ఒకవేళ పదవ తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలవారు వచ్చినప్పటికి వారిని కూడా చౌక ధరల దుకాణం డీలర్ గా నియమించుటకు పదవ తరగతి పాస్ అయిన వారితో సమానంగా చూడబడును.

2. వయస్సు:

దరఖాస్తు దారులు 18 సంవత్సరాల వయస్సు పై బడి 40 సంవత్సరాల లోపు ఉం వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు దారుల పై ఎలాంటి సివిల్/క్రిమినల్ కేసులు ఉండి ఉండరాదు. (ఎస్సి & ఎస్టీ లకు వయోపరిమితి వర్తించును.)

3. నివాసం/స్థానికత :

దరఖాస్తు దారులు అతడు/ఆమె సంబందిత గ్రామ నివాసి అయి ఉండవలెను లేదా చౌకధరల దుకాణం ఏ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నచో. ఆ గ్రామ పంచాయతి గ్రామానికి సంబందించిన వారు అయి ఉండాలి. స్థానికేతరులు దరఖాస్తు సమర్పించరాదు. పుట్టిన తేది, విద్యార్హతలు, కులం, పూర్తి చిరునామా మరియు స్థానికతకీ తగు ధ్రువ పత్రములను జతచేయవలెను.

4.ఇతరములు :

1. రెవిన్యూ శాఖలో పని చేయు వారికి దగ్గరి బందువు అయి ఉండరాదు.
2. పౌరసరఫర సంస్థలో పని చేయు వారి బంధువులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు బందువులై ఉన్న వారిని చౌక ధరల దుకాణం డీలర్ గా నియమించబడరు.
3. గ్రామపంచాయత్ సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్, సహకార సంఘ సభ్యులు, మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులు చౌకధరల దుకాణం డీలర్ కి అనర్హులు.
4. చౌకధరల దుకాణం డీలర్ గా నియమించబడిన వ్యక్తి ఒకవేళ ఏదైనా ఒక గ్రామ పంచాయతీకి గాని మునిసిపాలిటికి కాని ఇతర ప్రజా సంబంధమైన సంస్థలకు కాని ఎన్నిక అయినట్టు ఐతే వారిని డీలర్ గా తొలగించుటకు సమ్మతి పత్రం రాసి ఇయ్యవలెను.
5. డీలర్ గా నియమించిన వ్యక్తి తప్పకుండ 5 సంవత్సరములు పని చేయుటకు సిద్దం అయి ఉండవలెను. లేనిచో వారు కట్టిన ధరావత్ జప్తు చేయబడును.
6. అభ్యర్ధులు తగినంత ఆర్ధిక స్తోమత కలిగి ఉండవలెను.
7. దరఖాస్తు దారులు వారు దాఖలు చేయు సమయంలో వారు ఏ చౌకధరల దుకాణమునకు దరఖాస్తు చేయుచున్నారో కచ్చితంగా రాయవలెను. మరియు రిజర్వేషన్ వారికీ కేటాయించిన దుకాణములకు అట్టి దరఖాస్తు ని చేయవలెను.

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నియామకం :

  • వ్రాత పరీక్ష: 80 మార్కులు
  • ఇంటర్వ్యూ: 20 మార్కులు

వ్రాత పరీక్ష నందు నూరు(100) మార్కులకి కనీసం ముప్పై రెండు (32) మార్కులు సాధించిన వారిని ఇంటర్వూ ( మౌఖిక పరీక్ష ) 1 : 5 నిష్పత్తి ప్రకారం పిలువబడును. ఒకవేళ 5 గురు అభ్యర్థులు కంటే తక్కువ సంఖ్య లో కనీస అర్హత సాధించిన అభ్యర్ధులు ఉన్నచో వారందరు మౌఖిక పరీక్షకు అర్హులు. తదుపరి 5 అభ్యర్థుల కంటే ఎక్కువ ఉన్నచో అభ్యర్థులు కనీస అర్హత సాధించినచొ వారి వ్రాత పరీక్ష ఆధారంగా అవరోహణ క్రమములో మౌఖిక పరీక్ష నిర్వహించబడును.

6. సిలబస్:

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ మరియు చౌక ధరల దుకాణాల డీలర్ నిర్వహించాల్సిన రికార్డులపై మరియు రాష్ట్రములో ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క పనితీరు గురించి మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు మరియు ఇతర సాధారణ సమస్యలు/విషయాలు.

7: దరఖాస్తు విధానం :

పైన పేర్కొన్న ఖాళీలు పూరించుటకు దరఖాస్తులు తేది. 21.12.2022 నుండి 06.01.2023 వరకు రాజస్యమండాలదికారి గారి కార్యాలయము, ఆదిలాబాద్ నందు దాఖలు చేసుకోనవలెను (సెలవు రోజులలో దరఖాస్తులు స్వీకరించబడవు)దరఖాస్తు చేసుకొనిన అభ్యర్ధులు తేది. 22.01.2023(ఆధివారం) తేదిన వ్రాత పరీక్షకు ఉదయం సమయం. 11.00 AM గం,, ల నుండి మధ్యాహ్నం 1.00 PM నిమిషాల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), ఆదిలాబాద్ నందు నిర్వహించబడును. మరియు 27.01.2023(శుక్రవారం) తేది ఉదయం 11.00 AM గం లకు రాజస్యమండాలదికారి గారి కార్యాలయము ఆదిలాబాద్ నందు తమ ఒరిజినల్ ధ్రువ పత్రాలతో ఇంటర్వ్యూ కి హాజరు కావలెను.

దరఖాస్తు దారులు రూపాయలు 1000/-(రూ.వేయి) చెల్లించి దరఖాస్తు పత్రములను రాజస్యమండాలదికారి గారి కార్యాలయము ఆదిలాబాద్ నందు పొందగలరు.

సంబంధిత తహసిల్దార్లు ఖాళీలు గల చౌకధరల దుకాణము యొక్క గ్రామ పంచాయతి/మున్సిపాలిటి కార్యాలయము నోటీసు బోర్డు పై ప్రకటనను విధిగా అతికింపచేసి సంబందిత వ్యక్తిచే ద్రువీకరణను రాజస్వ మండలాధికారి గారి కార్యాలయమునకు పంపవలెను.

Last Date: 06.01.2023

ఆదిలాబాద్ డివిజన్ లో చౌక ధరల దుకాణము డీలర్ల నియామకం కొరకు ప్రకటన

The applicant’s responsibility is to ensure fulfillment of the eligibility criteria and requirements as mentioned in the advertisement. Therefore, applicants are advised to read the complete advertisement carefully before filling out the online application.

94 Join TS Jobs – WhatsApp Group

95 Join TS Jobs – WhatsApp Group

Download Notification: Click here

Official Site: Click here

Join Our Groups

Telegram | Facebook

Instructions:
  • Read the Notification Carefully.
  • Apply on the official site.
  • Get ready for the scanning of signatures, photographs, and documents.
  • Fill in the correct personal details.
  • Valid email id and mobile number.
  • Fill out the application form yourself.
  • Choose the correct category.
  • Take a print of the application form.
  • Clarify all doubts.
  • Only use a laptop or desktop.
  • Apply before the deadline.

Vidya Lakshmi Loan Portal Registration 2022
E-Shram Card Apply Online
Indane Gas Booking Number
Tax Saving PF FD And Insurance Tax Relief

Disclaimer – Naukriwin.com
This website will not be responsible at all in case of minor or major mistakes or Inaccuracies. I at this moment declare that all the information provided by this website is true and accurate according to the recruitment notification advertisement or information brochure Etc. But sometimes mistakes by the website owner by Any means might happen just as typing errors eye deception or other from the recruiter side. Our effort and intention are to provide as correct details as much as possible, before taking any action please look at the recruitment notification or advertisement portal. “I Hope You Will Understand Our Word”.

naukriwin.com